News May 19, 2024
క్వాలిటీ లేని పతంజలి సోన్ పాపిడి.. ముగ్గురికి జైలు శిక్ష

యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2019లో ఉత్తరాఖండ్‌లోని బెరినాగ్ మార్కెట్లో అమ్మిన సోన్ పాపిడి నాణ్యత లేనిదని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నిర్ధారించారు. ఈ కేసును విచారించిన చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ముగ్గురిని బాధ్యులుగా తేల్చారు. అసిస్టెంట్ మేనేజర్, డిస్ట్రిబ్యూటర్, స్థానిక వ్యాపారవేత్తకు జరిమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష విధించారు.
Similar News
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/
News December 1, 2025
బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 26,325, సెన్సెక్స్ 86,159 పాయింట్లతో ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60K మార్క్ క్రాస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 26,285 వద్ద, సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 86,020 వద్ద కొనసాగుతున్నాయి. బెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ITC నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
News December 1, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


