News October 22, 2024
నాలుగో పెళ్లి చేసుకున్న పాప్ సింగర్.. ట్విస్ట్ ఏంటంటే?

మూడు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సారి తనను తానే పెళ్లి చేసుకున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. సోలోగా హనీమూన్‌కు వెళ్లానని ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను చేసిన తెలివైన పని ఇదేనని రాసుకొచ్చారు. 42 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఈ ఏడాది మేలో సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకున్నారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.


