News May 15, 2024

టికెట్ కలెక్షన్ల కంటే పాప్‌కార్న్ ఆదాయమే ఎక్కువ!

image

అసలు కంటే సైడ్ బిజినెస్ నుంచే లాభాలను ఆర్జించింది PVR ఐనాక్స్ సంస్థ. బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గడంతో FY24ను నష్టాలతో ముగించిన PVRకు పాప్‌కార్న్ సేల్స్ ఊరటనిచ్చాయి. FY24లో ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగం 21% వృద్ధిని నమోదు చేసింది. ఇది టికెట్ సేల్స్ (19%) కంటే ఎక్కువ. FY23లో రూ.1,618 కోట్లు ఉన్న ఆదాయం ఈసారి రూ.1,958 కోట్లకు చేరింది. కాగా B.O రెవెన్యూ రూ.3,915 కోట్ల నుంచి రూ.3,295 కోట్లకు తగ్గింది.

Similar News

News February 3, 2026

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ సాధారణమే అయినా దాని రంగు మారినా, వజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. కొన్నిసార్లు ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ రావొచ్చు. దీన్ని త్వరగా గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News February 3, 2026

పాలు లేకుండా ఎవరైనా నెయ్యి చేయగలుగుతారా: పయ్యావుల

image

AP: నెయ్యి తయారీకి పాలు అవసరం లేదన్నట్లు రూలు మార్చారంటే దాని వెనుక దురుద్దేశం ఉన్నట్టా? లేనట్టా? అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ‘నిబంధనలు మార్చాకనే బోలేబాబా వంటి సంస్థలు వచ్చాయి. ఛైర్మన్ సుబ్బారెడ్డి PA అప్పన్న లీటర్‌కు రూ.25 ఇవ్వాలని అడిగితే అది తిరస్కరించింది. దీంతో బ్లాక్ లిస్టులో పెట్టించగా వైష్ణవీ డెయిరీతో కలిసి దొడ్డిదారిన మళ్లీ వచ్చింది. ఇవన్నీ విచారణలో తేలాయి’ అని పేర్కొన్నారు.

News February 3, 2026

మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

image

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.