News January 12, 2025

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం

image

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్‌నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.

Similar News

News January 12, 2025

మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి: సీఎం

image

TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.

News January 12, 2025

సీనియర్ ప్లేయర్లపై బీసీసీఐ కీలక నిర్ణయం?

image

టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పని ఒత్తిడి వల్ల వారికి ఆడడం కుదరకపోతే ముందుగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనుమతి తీసుకోవాలని సమాచారం. దీనిని అతిక్రమించినవారిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లనే జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News January 12, 2025

ఎన్నికలంటేనే భయం వేస్తోంది.. పోటీ చేయలేం: మాజీ సీఎం కిరణ్

image

AP: ఏ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగా తాను మారలేదని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. డబ్బు దోచుకునే వాళ్లలో కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటేనే భయమేస్తోందని, రానున్న రోజుల్లో పోటీ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.