News May 24, 2024
పాపులర్ మీమ్ డాగ్ కబోసు మృతి

పాపులర్ మీమ్ డాగ్ చీమ్స్ బాల్ట్జ్ను పోలిఉన్న జపనీస్ కుక్క కబోసు మరణించింది. దీనికి 19 ఏళ్లని, ఈనెల 26న వీడ్కోలు పార్టీ ఉంటుందని యజమాని అట్సుకో తెలిపారు. దీంతో RIP అంటూ అభిమానులు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కబోసు చిత్రాలతో మీమ్స్ చక్కర్లు కొట్టాయి. ట్విటర్ లోగోలో ఉన్న పిట్టను తొలగించి మస్క్ ఒకరోజు పాటు మీమ్ డాగ్ చిత్రాన్ని లోగోగా మార్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.
News November 27, 2025
30 రోజుల్లో 1400 భూకంపాలు

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.
News November 27, 2025
స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.


