News December 26, 2024
ప్రముఖ RJ, ఇన్‌స్టా ఫేమ్ ఆత్మహత్య
రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్‌లో సెక్టర్-47లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కు ఇన్‌స్టాలో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమెను ‘జమ్మూ కి ధడ్కన్’గా పిలుచుకుంటారు. సిమ్రాన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Similar News
News December 27, 2024
GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!
గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.
News December 27, 2024
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.