News October 25, 2024
పాపులర్ ఓటు Vs ఎలక్టోరల్ ఓటు.. ఏది ముఖ్యం? (3/3)

పాపులర్ ఓట్ల (ప్రజలు వేసే ఓట్లు) కంటే ఎలక్టోరల్ ఓట్లే కీలకం. పాపులర్ ఓట్లు ఎక్కువ సాధించినా ఎలక్టోరల్ ఓట్లలో విఫలమై పలువురు అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. 2000లో అల్గోర్ 48.4%, బుష్ 47.9% ఓట్లు సాధించారు. అయితే బుష్ 271 ఎలక్టోరల్ ఓట్లు పొందగా, అల్గోర్ 266 పొందారు. ఇక 2016లో హిల్లరీ 48.2%, ట్రంప్ 46% ఓట్లు పొందారు. అయితే 304 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు.
Similar News
News November 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.
News November 11, 2025
బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.
News November 11, 2025
గూగుల్ కొత్త ఫీచర్.. బ్యాటరీ తినేసే యాప్స్‌కు చెక్!

బ్యాటరీ తినేసే యాప్‌లకు చెక్ పెట్టే కొత్త ఫీచర్‌ను 2026 మార్చి 1 నుంచి గూగుల్ అమలులోకి తెస్తోంది. 24 గంటల్లో 2 గంటలకు మించి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితే దానిని బ్యాటరీ డ్రెయిన్ యాప్‌గా గుర్తిస్తారు. వీటిపై డెవలపర్స్‌ను గూగుల్ ముందుగా అలర్ట్ చేస్తుంది. సమస్యను ఫిక్స్ చేయకుంటే ప్లేస్టోర్‌లో ప్రాధాన్యం తగ్గిస్తుంది. యాప్స్‌ను ప్లేస్టోర్‌లో డౌన్లోడ్, అప్డేట్ చేసుకునేటప్పుడు యూజర్లను హెచ్చరిస్తోంది.


