News March 27, 2025
జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.
Similar News
News March 30, 2025
స్టార్క్‌కు టీ20ల్లో ఇదే తొలిసారి

మిచెల్ స్టార్క్ తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు. ఈ 35 ఏళ్ల ప్లేయర్ టెస్టుల్లో 15, వన్డేల్లో 9 సార్లు ఐదేసి వికెట్లు తీశారు. అయితే టీ20ల్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఐపీఎల్-2025లో డీసీ తరఫున ఈ ఘనత సాధించారు. SRHతో మ్యాచులో కీలక వికెట్లు తీసి ఆ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు.
News March 30, 2025
మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

ఇప్పటికే ఎన్కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14మంది తలలపై రూ.68లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. PM మరికొన్ని గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనుండగా ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో 25మంది నక్సలైట్లు లొంగిపోయారు.
News March 30, 2025
‘విశ్వావసు’లో మంచి ముహూర్తాలు ఇవే..

* ఏప్రిల్: 6, 16, 18, 20, 23, 30
* మే: 1, 8, 9, 11, 17, 18, 28
* జూన్: 1, 2, 5, 6, 7, 8 * జులై: 16, 30
* ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10, 13, 14, 17
* సెప్టెంబర్: 26, 27
* అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24
* ఫిబ్రవరి(2026): 19, 20, 21, 22, 25, 26, 27
* మార్చి: 4, 5, 7, 8, 11
* జూన్ 26- జులై 24, ఆగస్టు 24-సెప్టెంబర్ 21, నవంబర్ 21- ఫిబ్రవరి 18(2026), మార్చి12-19(2026) మధ్య ముహూర్తాలు లేవు.