News March 27, 2024

పాపులేషన్ ఎఫెక్ట్.. బేబీ డైపర్స్ ఉత్పత్తిని ఆపేసిన జపాన్ సంస్థ

image

జపాన్‌లో జనాభా రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోతుందనడానికి ఓ డైపర్ల కంపెనీ పరిస్థితి ఉదాహరణగా నిలుస్తోంది. డిమాండ్ తగ్గడంతో ఇకపై పిల్లల డైపర్ల తయారీని నిలిపివేస్తున్నామని ఆ స్థానంలో అడల్ట్ డైపర్ల ఉత్పత్తి పెంచనున్నట్లు ఓజీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. గత పదేళ్లలో అడల్ట్ డైపర్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. కాగా ప్రస్తుతం 125 మిలియన్లుగా ఉన్న జపాన్ జనాభా 2065కి 88 మిలియన్లకు క్షీణిస్తుందని అంచనా.

Similar News

News October 4, 2024

ఆ ఉద్యోగుల బదిలీల నిలుపుదల

image

AP: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీలను నిలుపుదల చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారుల ట్రాన్స్‌ఫర్ల‌పై నిషేధం విధించింది. ఈ నెల 29 నుంచి 2025 జనవరి 6 వరకు తమ అనుమతి లేకుండా బదిలీ చేయొద్దని ఆదేశించింది. అక్టోబర్ 10లోపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.

News October 4, 2024

చిన్న ఆలయాలకు సాయం రూ.10వేలకు పెంపు

image

AP: ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతిగా, రూ.3వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్చకుడి ఖాతాలోనే జమ చేస్తామంది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది.

News October 4, 2024

ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్

image

చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా, రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రజినీ నటించిన ‘వేట్టయాన్’ ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.