News September 23, 2025
దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోంది: చంద్రబాబు

AP: అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘మన దేశంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. యూపీ, బిహార్ వల్లే ఆ లెక్కలు బ్యాలెన్స్ అవుతున్నాయి. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుంది. WHO ప్రకారం మన రాష్ట్రంలోనే PHCలు, మెడికల్ ఆఫీసర్లు ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.
Similar News
News September 23, 2025
డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.
News September 23, 2025
ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రా. గోల్డ్ ధర రూ.2,700 పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,18,900కు చేరింది. అటు కేజీ వెండి ధర ఈ ఒక్కరోజే రూ.3,320 పెరిగి రూ.1,39,600 పలుకుతోంది.
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు