News February 18, 2025
పోర్న్ + డోపమైన్ ఫీడ్బ్యాక్ లూప్.. పిల్లల జీవితం నాశనమే!

ఆనందం, రివార్డు, ప్రేరణ కోసం మెదడు డోపమైన్ విడుదల చేస్తుంది. ఇది మన ప్రవర్తనపై ప్రభావం చూపి మళ్లీ మళ్లీ అదే పని చేయిస్తుంది. Ex. రీల్స్, పోర్న్ చూడటం, షుగర్ ఫుడ్స్ తినడం వంటివి. జీవితంలో ఎదిగే లక్ష్యాలకు దీన్ని వాడుకుంటే మేలు. అదే పోర్న్, డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడితే జీవితం నాశనమే. మాథ్స్ వంటి పాఠాలతో పోర్న్హబ్కు తీసుకెళ్లి పిల్లలతో మళ్లీమళ్లీ అదే చూసేలా చేస్తారు. జాగ్రత్త!
Similar News
News December 5, 2025
బిగ్గెస్ట్ డీల్: నెట్ఫ్లిక్స్ సొంతమైన ‘Warner Bros’

ఎంటర్టైన్మెంట్ రంగంలోనే భారీ డీల్ అమల్లోకి వచ్చింది. Warner Bros టెలివిజన్ స్టూడియోస్, HBO, HBO MAXలను $82.7bn(₹7.44L Cr)కు కొనుగోలు చేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఒక్కో షేర్ను $27.75గా లెక్కగట్టినట్లు పేర్కొంది. ఈ డీల్ 2026 Q3లో పూర్తవుతుందని తెలిపింది. దీంతో లక్షల గంటల WB కంటెంట్ నెట్ఫ్లిక్స్లో దొరకనుంది. ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేయడమే తమ లక్ష్యమని సంస్థ co-CEO సరండోస్ అన్నారు.
News December 5, 2025
రాష్ట్రపతి భవన్కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించడం గమనార్హం.
News December 5, 2025
హోంలోన్లు తీసుకునేవారికి గుడ్న్యూస్

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?


