News February 1, 2025
పోర్న్ స్టార్ మృతి

బ్రెజిల్ పోర్న్ స్టార్ అన్నా బిట్రిజ్ పెరీరా (అన్నా పోలీ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు సహ నటులతో పోర్న్ ఫిల్మ్ షూటింగ్ ముగిశాక ఈ 27 ఏళ్ల నటి బిల్డింగ్ నుంచి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరు సహ నటులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో కుట్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారు.
Similar News
News November 23, 2025
గుడ్ న్యూస్.. DEC 1 నుంచి PhD ఇంటర్వ్యూలు

JNTUలో PhD ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం వర్సిటీ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 8వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఒక్క ఆదివారం మినహాయిస్తే మిగతా రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయం గమనించి హాజరుకావాలని సూచించారు.
News November 23, 2025
ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం: విజయ్

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యమని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.


