News March 18, 2024
పోరుమామిళ్ల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
Similar News
News January 24, 2026
కడప: 2 బస్సులు ఢీ.. ఒకరు మృతి.!

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రొద్దుటూరు వాసి మృతి చెందాడు. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న RTC బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మైదుకూరు- చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్దన్రెడ్డి (55) మృతి చెందాడు. సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 24, 2026
బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 24, 2026
కడప: జనయాత్ర పుస్తకం ఆవిష్కరణ

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ గతంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలతో రూపొందించిన ‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పుస్తక రచయిత రాచమల్లు రవిశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. రచయితను జగన్ అభినందించారు.


