News March 2, 2025
పోసాని కేసు: సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడు భార్గవ రెడ్డితో కలిసి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని తిట్టానని నటుడు పోసాని కృష్ణమురళి చెప్పడంతో వారు కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఇరికిస్తున్నారని, బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామని కోరారు.
Similar News
News November 23, 2025
భీమడోలు: పంట కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

భీమడోలు మండలం కురెళ్లగూడెంలోని వైర్ పంట కాల్వలో గుర్తు తెలియని మృతదేహాన్ని భీమడోలు పోలీసులు శనివారం గుర్తించారు. కొల్లేరు పొలాల్లోకి వెళ్లే వైర్ కాల్వలో సుమారు 35- 45 సం.లు వ్యక్తి మృతదేహం దుర్వాసన రావడంతో గుర్తించామని SI మదీనా బాషా తెలిపారు. మృతుడు గుండుతో చేతికి కాశీ తాడు కలిగి ఉన్నాడన్నారు. తాడేపల్లిగూడెం వైపు నుంచి కొట్టుకు వచ్చి ఉండొచ్చని స్థానిక VRO ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశారు.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


