News February 27, 2025

రహస్య ప్రాంతంలో పోసాని విచారణ

image

AP: నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. కడపలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కాసేపట్లో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకెళ్లనున్నారు. అక్కడ సీఐ విచారణ చేసి, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

image

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్‌‌ ఆహ్వానం

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.