News March 13, 2025
‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.
Similar News
News April 10, 2026
ఒక్క రోజే రూ.2,950 కోట్లు.. రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట

AP: రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే రూ.2,950 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా మొదలైనట్లు చెప్పారు.
News April 10, 2026
IPL: నేడు తొలి ఓటమిని రుచి చూసేదెవరో?

IPLలో ఈరోజు గువాహటి వేదికగా RCB, RR మధ్య 7.30PM నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. RR ఆడిన 3 మ్యాచులూ గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. RCB 2 విజయాలతో మూడో స్థానంలో ఉంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా RCB 17, RR 14 విక్టరీలు సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం ముప్పు లేదని క్రిక్‌బజ్ పేర్కొంది.
News April 10, 2026
75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు!

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాజరు 75% లేకపోతే పరీక్షలకు అనుమతించొద్దని, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయనుంది. అలాగే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అందించనున్నారు.


