News March 29, 2025

LRS రాయితీ గడువు పెంచే అవకాశం?

image

TG: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన 25% రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు రాయితీ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News March 31, 2025

రూ.2వేల కోట్ల ఆస్తి పన్ను.. GHMC రికార్డ్

image

TG: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. 2024-25కు గాను రూ.2,012 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. GHMC చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద రూ.465 కోట్లు వసూలైందని చెప్పారు.

News March 31, 2025

హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

image

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.

News March 31, 2025

లోన్ తీసుకునేవారికి ALERT!

image

రుణాలు తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. రేపటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వంటివాటిలో మూడింటికి మించి లోన్లు తీసుకోవడం ఇకపై కుదరదు. రుణాల ఎగవేతల్ని కట్టడి చేసేందుకు RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబరునాటికి 45 లక్షలమంది 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకోవడం గమనార్హం.

error: Content is protected !!