News October 3, 2025

శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

image

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.

Similar News

News October 3, 2025

‘స్త్రీనిధి’ చెల్లింపులకు యాప్.. ఎలా వాడాలంటే?

image

AP: బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్త్రీనిధి వాయిదా చెల్లింపుల కోసం ప్రభుత్వం ‘కాప్స్‌ రికవరీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. అందులో సభ్యురాలి ఫోన్‌ నంబరు/పిన్‌‌తో లాగిన్‌ అవ్వాలి. గ్రూప్ పేరు సెలెక్ట్ చేస్తే లోన్ తీసుకున్నవారి లిస్ట్ కనిపిస్తుంది. పేరు క్లిక్‌ చేయగానే ఆమె చెల్లించాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డబ్బు చెల్లించాక రసీదు జనరేట్ అవుతుంది.

News October 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, ZPTC ఎలక్షన్స్‌కు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని వివరించింది.

News October 3, 2025

ఆన్‌లైన్ మనీగేమ్‌లపై ప్రచారం చేస్తే 2 ఏళ్ల జైలు

image

ఆన్‌లైన్ మనీగేమ్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. PROG Act ప్రకారం కేంద్రం draft రూల్స్‌ను ప్రకటించింది. OGAIకి సివిల్ కోర్టు అధికారాలు కల్పించింది. ఇకపై ఈ గేమ్‌లను ఆఫర్ చేస్తే 3ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా విధిస్తారు. వీటిపై ప్రచారాలు చేసే వారికి 2ఏళ్ల ఖైదు, ₹50 లక్షల ఫైన్ తప్పదు. వారెంటు లేకుండా సోదాలు, అరెస్టులూ చేయొచ్చు. పందేలు, పాయింట్లను మనీగా మార్చుకొనేలా ఉంటే మనీ గేమ్‌లుగా పరిగణిస్తారు.