News April 25, 2024
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలి: ఉద్యోగ సంఘాలు

AP: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నెల 30 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరాయి. అంతకుముందు ఈ నెల 26వరకు పోస్టల్ బ్యాలెట్‌కు ఈసీ గడువు పొడిగించింది.
Similar News
News January 29, 2026
తిరుమల లడ్డూ.. YCP vs టీడీపీ, జనసేన

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని సిట్ పేర్కొందని, చంద్రబాబు, పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని వైసీపీ వరుస పోస్టులు చేస్తోంది. వారు క్షమాపణలు చెప్పాలని #ApologizeToDevotees అనే హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోంది. అటు లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని, కెమికల్స్‌తో చేసినట్లు సిట్ పేర్కొందని టీడీపీ, జనసేన శ్రేణులు #NoGheeInTTDLaddu అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.
News January 29, 2026
రేపు ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’: భూమన

AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI ఛార్జ్‌షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. రేపు 10AMకు తిరుపతిలో ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ చేపడతామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.
News January 29, 2026
₹3 కోట్లతో తీస్తే ₹30 కోట్ల వసూళ్లు.. ‘సిరాయ్’ చూశారా?

₹3 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో తెరకెక్కిన సిరాయ్ మూవీ ₹31.58 కోట్ల వసూళ్లు సాధించింది. గతేడాది డిసెంబర్ 25న రిలీజై మేకర్లకు ఏకంగా 700% లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం Z5 OTTలో సందడి చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే ఓ కానిస్టేబుల్ (విక్రమ్ ప్రభు) కథే సిరాయ్. మూవీలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు కట్టిపడేస్తాయి. యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.


