News June 12, 2024
గోపీచంద్ ‘విశ్వం’ నుంచి పోస్టర్ రిలీజ్
గోపీచంద్ తొట్టెంపూడి హీరోగా నటిస్తున్న ‘విశ్వం’ మూవీ నుంచి పోస్టర్ విడుదలైంది. గోపీచంద్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ మేకోవర్ పవర్ఫుల్గా కనిపిస్తోంది. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
Similar News
News December 23, 2024
బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు
TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.
News December 23, 2024
మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
TG: మోహన్బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
News December 23, 2024
ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ
భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.