News September 4, 2024
‘KCR కనబడుటలేదు’ అంటూ వెలిసిన పోస్టర్లు

మాజీ సీఎం KCR కనబడుటలేదంటూ HYDలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. కొన్ని మెట్రో పిల్లర్లతో పాటు పలు చోట్ల గోడలపై పోస్టర్లు అంటించారు. ‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అని వాటిలో రాసి ఉంది. ఖమ్మంలో భారీ వరదల రోజు సీఎం, మంత్రులు ప్రజలను రక్షించకుండా ఎక్కడికి వెళ్లారన్న BRS ఆరోపణలకు కౌంటర్గా ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 22, 2025
లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే..

ముఖానికి మరింత సౌందర్యం అద్దడానికి చాలామంది మహిళలు లిప్స్టిక్ వేసుకుంటారు. అయితే ప్రస్తుతం లిక్విడ్ లిప్స్టిక్ ట్రెండ్ అవుతోంది. దీన్ని సరిగా వాడకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ముందు లిప్లైనర్తో పెదాల చుట్టూ లైనింగ్ చేయండి. తర్వాత లిక్విడ్ లిప్స్టిక్ను అప్లై చేసి ఆరనివ్వాలి. లిప్స్టిక్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే ఓ టిష్యూతో పెదాలను అద్దాలి. ఇలా చేస్తే లిప్స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.
News October 22, 2025
ట్రాన్స్కో, జెన్కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.
News October 22, 2025
రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.