News November 10, 2024
ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్, బదిలీలు

☞ ఆర్థికశాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్
☞ మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబు
☞ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
☞ కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
☞ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత
Similar News
News February 14, 2026
కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ కన్నుమూత

కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్(80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా కాపాడలేకపోయామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.
News February 14, 2026
మచిలీపట్నంలోని BELలో పోస్టులు

మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్<
News February 14, 2026
నామినేషన్ కోసమే రూ.8కోట్లు.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమి

TG: నామినేషన్ సమయంలో రూ.8కోట్ల పన్ను కట్టిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె BJP అభ్యర్థి చేతిలో ఓడారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. తన డివిజన్‌లో ఒక్కో ఓటుకు ₹5వేల వరకు పంచినట్లు సమాచారం. మిగతా డివిజన్లకూ డబ్బు సర్దడంతో ₹20కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.


