News October 27, 2024

IASలకు పోస్టింగ్స్.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి

image

AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.
*టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
*వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
*జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్
*కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్
**మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

Similar News

News October 27, 2024

ఏ మూవీ రీమేక్‌ చేస్తారు? విజయ్ దేవరకొండ అన్సర్ ఇదే

image

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఒకవేళ ఏదైనా మూవీ రీమేక్‌ చేయాల్సి వస్తే ఏది చేస్తారని యాంకర్ సుమ ఆయనను ప్రశ్నించారు. దీనికి బదులుగా తాను 1989లో పుట్టానని, అదే సంవత్సరం ఆర్జీవీ శివ మూవీ వచ్చిందన్నారు. ఈ మూవీ రీమేక్‌ చేయాలని ఉందన్నారు. ప్రస్తుతం విజయ్ #VD12లో నటిస్తున్నారు.

News October 27, 2024

బీజేపీకి ప్రజల భద్రత కంటే పబ్లిసిటీయే ముఖ్యం: రాహుల్ గాంధీ

image

దేశంలో మౌలిక వసతుల కల్పనలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఆరోపించారు. ‘భారత్‌లో మౌలిక వసతుల కల్పన దారుణంగా దిగజారింది. ముంబై రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట అందుకో ఉదాహరణ. గత ఏడాది బాలాసోర్ రైలు ప్రమాదంలో 300మంది చనిపోయారు. ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోయింది. BJPకి కావాల్సింది పబ్లిసిటీ మాత్రమే తప్ప ప్రజల భద్రత కాదు’ అని విమర్శించారు.

News October 27, 2024

IPL: ఆరుగురు కెప్టెన్ల రిలీజ్?

image

ఐపీఎల్ 18 సీజన్ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్లను వదులుకోవాలని ఆరు ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో శిఖర్ ధవన్-పంజాబ్ కింగ్స్, డుప్లెసిస్-ఆర్సీబీ, రిషభ్ పంత్-ఢిల్లీ క్యాపిటల్స్, శ్రేయస్ అయ్యర్-కేకేఆర్, కేఎల్ రాహుల్-లక్నో, శుభ్‌మన్ గిల్-గుజరాత్ టైటాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఆరుగురు కెప్టెన్లలో శిఖర్ ధవన్ మినహా అందరూ వేలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.