News June 10, 2024

కత్తిగాటు లేకుండా పోస్టుమార్టం.. త్వరలో ఏపీలో అందుబాటులోకి

image

కత్తిగాటు లేకుండా వర్చువల్ అటాప్సీ విధానంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసే టెక్నాలజీ త్వరలో ఏపీలో రానుంది. ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. సీటీ, ఎమ్మారై, 3D ఫొటోగ్రామ్మెట్రీ టెక్నాలజీ ఉన్న యంత్రంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. మృతదేహాన్ని బ్యాగుల్లో ఉంచి యంత్రంలోకి పంపిస్తే అన్ని కోణాల్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటిని బట్టి మృతికి గల కారణాలను నిర్ధారిస్తారు.

Similar News

News December 23, 2024

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఏపీలో చాలా జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయని వెల్లడించింది.

News December 23, 2024

‘పుష్ప-2’ సన్నివేశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు

image

‘పుష్ప-2’ సినిమా పోలీసులను కించపరిచే విధంగా ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి ‘పుష్ప-2’ వసూళ్లలో 10శాతం ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

News December 23, 2024

ఈ మోడల్ ఫోన్లలో WhatsApp పని చేయదు!

image

పదేళ్లు దాటిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ OSతో పని చేసే ఫోన్లలో JAN 1, 2025 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S3, S4 మినీ, నోట్2, మోటో జీ, మోటో రేజర్ HD, మోటో E 2014, LG నెక్సస్ 4, LG G2 మినీ, సోనీ ఎక్స్‌పీరియా Z, SP, V, HTC 1X, 1X+ తదితర మోడల్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. అలాగే ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ మే 5 నుంచి ఇదే నిబంధన వర్తించనుంది.