News November 9, 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా

TG: BRSలో గెలిచి కాంగ్రెస్లో చేరిన MLAలపై అనర్హత అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఫిర్యాదు చేసిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని BRS వాదనలు వినిపించింది. దీనిపై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఫిరాయింపు MLAపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.
Similar News
News November 4, 2025
పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.
News November 4, 2025
రేపు గురుపూర్ణిమ.. సెలవు

రేపు (బుధవారం) గురుపూర్ణిమ/గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. అటు ఏపీలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు లేదు. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చారు.
News November 4, 2025
మనం కూడా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిందేనా?

చైనా, పాకిస్థాన్ <<18185605>>న్యూక్లియర్<<>> వెపన్ టెస్టులు చేస్తున్నాయని ట్రంప్ చెప్పడం భారత్కు ఆందోళన కల్గించే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1998 నుంచి భారత్ అణుపరీక్షలు జరపలేదు. 2025 నాటికి మన దగ్గర 180 వార్హెడ్స్ ఉంటే.. చైనాలో 600, పాకిస్థాన్లో 170 ఉన్నాయి. త్వరలో పాక్ 200, చైనా 1,000కి చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ న్యూక్లియర్ టెస్టులు ప్రారంభించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


