News November 22, 2024

రిజిస్ట్రేషన్ విలువల సవరింపు వాయిదా

image

AP: ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ విలువల సవరింపును రాష్ట్ర ప్రభుత్వం జనవరికి వాయిదా వేసింది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో విలువలను పెంచగా, వాటిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అభివృద్ధి ప్రాతిపదికన ఇతర చోట్ల పెంచనుంది. సవరించిన విలువలను తొలుత డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తేవాలని భావించింది. కానీ విలువల నిర్ధారణకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వాయిదా వేసింది.

Similar News

News November 22, 2024

స్కూళ్ల సమయం పెంపుపై లోకేశ్ క్లారిటీ

image

AP: స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు MLAలు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు సమయం మార్చుతామని తెలిపారు. హైస్కూళ్లు ఉదయం 9- 4గంటల వరకు పని చేస్తుండగా, 5వరకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని 2స్కూళ్లలో ఇది అమలు అవుతోంది.

News November 22, 2024

శాసనమండలి నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 8 బిల్లులను మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.

News November 22, 2024

టిష్యూ ఖరీదు రూ.8.4 కోట్లు.. ఎందుకంటే?

image

అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అందులో కొందరు ఆయన ధరించిన జెర్సీ, షూ తదితర వస్తువులను వేలంలో రూ.కోట్లు చెల్లించి దక్కించుకుంటారు. అలాంటి ఓ వేలంలో మెస్సీ తన కన్నీళ్లు తుడుచుకోడానికి వాడిన టిష్యూ కూడా ఉంది. వరల్డ్ కప్ -2022 విజయం తర్వాత ఆయన భావోద్వేగం చెందుతూ వినియోగించిన టిష్యూను $1 మిలియన్(రూ.8.45 కోట్లు)కు ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.