News October 19, 2024

వాయిదాలతో విద్యార్థులకే నష్టం: రేవంత్

image

TG: పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని CM రేవంత్ చెప్పారు. ‘తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని BRS పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని CM కోరారు.

Similar News

News November 21, 2025

HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాలి: సీపీ

image

నగరంలో ట్రాఫిక్ విభాగం పనితీరు రోజురోజుకు మెరుగుపడుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆయన ట్రాఫిక్ విభాగంపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రంక్& డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 21, 2025

ప్రసార్‌భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని <>ప్రసార్‌భారతి<<>> 29 కాపీ ఎడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ డిప్లొమా( జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: prasarbharati.gov.in/