News December 22, 2024

రైల్వేలో పోస్టులు.. వివరాలివే

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <>వెబ్‌సైట్<<>> ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు రుసుం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంది. పోస్టుల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కు 338 ఖాళీలుండగా అత్యల్పంగా సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 2 ఖాళీలున్నాయి.

Similar News

News December 30, 2025

₹50 లక్షల జాయినింగ్ బోనస్

image

ఇండిగో పైలట్స్ రిక్రూట్మెంట్ స్పీడప్ చేసింది. ₹15లక్షలు-₹25L గల జాయినింగ్ బోనస్‌ను ₹50L వరకు పెంచుతోంది. అయితే బోనస్‌తో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్సూ మారాలని ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ సరైన లైఫ్ స్టైల్ లేక పైలట్స్ విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. కాగా అలసట, ఒత్తిడి తగ్గించేలా పైలట్లకు వారంలో 48Hrs విరామం ఉండాలన్న కొత్త రూల్‌తో స్టాఫ్ కొరత ఏర్పడింది.

News December 30, 2025

పాన్-ఆధార్ లింక్.. రేపే లాస్ట్ డేట్

image

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు రేపటితో(DEC 31) ముగియనుంది. లింక్ చేసేందుకు IT <>ఈ-ఫైలింగ్<<>> పోర్టల్‌కి వెళ్లి ‘లింక్ ఆధార్’ క్లిక్ చేసి వివరాలు, OTP ఎంటర్ చేయాలి. మినిమం ఫీజు పే చేశాక మళ్లీ ‘లింక్ ఆధార్’లో డీటెయిల్స్, OTP వెరిఫై చేస్తే పాన్, ఆధార్ లింక్ అవుతాయి. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి. మళ్లీ యాక్టివేట్ చేయాలంటే రూ.1000 చెల్లించాల్సిందే.

News December 30, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్ జిల్లాలోని వాలుకా ప్రాంతంలోని ఓ దుస్తుల కర్మాగారంలో పని చేస్తున్న హిందూ కార్మికుడు బజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యారు. సహోద్యోగి నోమన్ మియా షాట్‌గన్‌తో కాల్చగా అది బిస్వాస్ తొడకు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.