News September 9, 2024

మంచు విష్ణుపై పోస్టులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

image

‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు దిగారు. విజయ చంద్రహాస్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు సినీ ప్రముఖులపై తప్పుడు వీడియోలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పాడని వెల్లడించారు.

Similar News

News October 14, 2025

తిరుమల: 23 కంపార్టుమెంట్లలో భక్తులు

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 78,569 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News October 14, 2025

ఏమిటీ పరకామణి కేసు-రాజీ వ్యవహారం..?

image

తిరుమల <<17999947>>పరకామణి<<>>లో 2023లో ఉద్యోగి రవికుమార్ దొంగతనం చేయడంపై CID విచారణ జరగాలని స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు గతేడాది HCలో పిటిషన్ వేశారు. ఈ చోరీపై 2023 APRలో పోలీసులకు ఫిర్యాదు చేసిన TTD విజిలెన్స్ ఆఫీసర్ సతీష్, SEPలో లోక్ అదాలత్‌లో రవితో రాజీ చేసుకున్నారని తెలిపారు. దీంతో అదాలత్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన జస్టిస్ రామకృష్ణ.. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్‌కు CIDని ఆదేశించినా ఆ పని చేయలేదు.

News October 14, 2025

ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

image

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్‌లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్‌చెరులో 20గుంటలు, షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్‌ను జప్తు చేయనున్నారు.