News November 2, 2024
నేటి నుంచి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం
AP: సీఎం చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ‘గుంతల రహిత రోడ్ల నిర్మాణం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి రూ.860 కోట్లతో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లకు ఇరువైపులా కంప చెట్లను కొట్టేయడంతోపాటు కల్వర్టుల నిర్మాణాన్ని చేపడుతుంది. ఇందుకోసం SRM వర్సిటీ, IIT తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Similar News
News November 2, 2024
ఆస్ట్రేలియా Aతో మ్యాచ్.. సాయి సుదర్శన్ సెంచరీ
ఆస్ట్రేలియా A జరుగుతోన్న మ్యాచులో ఇండియా A ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశారు. ఓపెనర్లు రుతురాజ్, అభిమన్యు ఈశ్వరన్ విఫలం కాగా సుదర్శన్ సెంచరీ చేశారు. మరో యువ బ్యాటర్ పడిక్కల్ 88 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ 32, నితీశ్ కుమార్ రెడ్డి 17 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇండియా A 199 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News November 2, 2024
అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్
అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. TGలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు మధ్య కొత్త బ్రాడ్గేజ్ లైన్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది. భూమిని స్వాధీనం చేసుకోవడం, ఉపయోగించడంపై అభ్యంతరాలు ఉన్నవారు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు అభ్యంతరాలు తెలపాలంది.
News November 2, 2024
తెలంగాణలో భారీగా పెరిగిన పశుసంపద
TG: రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో పశుసంపద భారీగా పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ పేర్కొంది. దాదాపు రూ.2వేల కోట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గుడ్ల ఉత్పత్తి రెట్టింపు కాగా మాంసం ఉత్పత్తిలోనూ గణనీయమైన అభివృద్ధి జరిగిందని వివరించింది. పశుసంపద, పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.2,824.57కోట్లు ఉండగా 2022-23 నాటికి అది రూ.4,789.09కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.