News March 16, 2024
పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివి: ఎస్పీ

రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి,జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, ఆర్ఐ రాముడు పాల్గొన్నారు.
Similar News
News January 26, 2026
అండమాన్ జైలును సందర్శించిన MP అంబికా

మూడు రోజుల అండమాన్ పర్యటనలో సెల్యులార్ జైలును సందర్శించడం తీవ్ర భావోద్వేగాన్ని కలిగించిందని అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకున్నట్లు తెలిపారు. గొప్ప దేశభక్తులకు నివాళులు అర్పించే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. జైలు గదులు, గోడలు అమర వీరుల త్యాగాలకు మూగ సాక్షులుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
News January 26, 2026
ప్రధాని నోట అనంతపురం మాట.. మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

మన్ కీ బాత్లో అనంతపురం ‘అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టు’ను ప్రశంసించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 10కి పైగా రిజర్వాయర్ల పునరుద్ధరణ, 7 వేల మొక్కలు నాటడం వంటి ప్రజల సామూహిక కృషిని ప్రధాని గుర్తించడం గర్వకారణమని లోకేశ్ ట్వీట్ చేశారు. నీటి భద్రత కోసం అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్న పోరాటం జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News January 25, 2026
అనంత జిల్లాలో రథసప్తమి ఎఫెక్ట్.. తగ్గిన ధరలు

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.240, స్కిన్ లెస్ రూ.260 కళ్యాణదుర్గంలో రూ.280 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. చికెన్ ధరలు తగ్గడంతో మాంసప్రియులు హర్షం వ్యక్తం చేశారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి.


