News March 17, 2025
పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 9, 2025
బాపట్ల: హైవేపై డివైడర్ను ఢీకొట్టిన కారు

కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అరుణాచలం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో స్థానిక నయారా పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్తో పాటు ముగ్గురు మహిళలు ఉండగా ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెని 108 అంబులెన్స్లో స్థానిక PHCకి తరలించారు.
News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
News December 9, 2025
శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారా?

శ్రీశైలం సముద్ర మట్టానికి 1,500Ft ఎత్తులో, 2,830Ft శిఖరం కలిగిన పవిత్ర క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి పూజామందిరంగా, రాముడు, పాండవులు దర్శించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1,326-35లో దీనికి మెట్లు నిర్మించారు. ఎంతో కష్టపడొచ్చి దూళి దర్శనం చేసుకున్న భక్తులు పాతాళ గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి దైవానుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు.


