News March 9, 2025
ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ

బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో చికెన్ అమ్మకాలు తగ్గి తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం షెడ్లలో ఉన్న కోళ్లను అమ్మేందుకు కూడా రైతులకు కష్టమవుతోంది. దీంతో కొత్తగా కోడి పిల్లలను దింపుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇదే సమయంలో షెడ్ల క్లీనింగ్‌పై ఫోకస్ పెట్టిన రైతులు వైరస్ వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్ అమ్మకాలు పుంజుకుంటేనే తాము నిలబడతామంటున్నారు.
Similar News
News March 26, 2026
రేపు వైన్స్ బంద్

TG: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు శుక్రవారం బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలు రేపు మూసి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వైన్స్‌తో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, మిలిటరీ క్యాంటీన్లు బంద్ చేయాలని హైదరాబాద్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 26, 2026
ఇరాన్‌కు షాక్.. హార్ముజ్ బ్లాక్ చేసిన నేవీ చీఫ్ హతం!

హార్ముజ్ ఒడ్డున ఉండే బందర్ అబ్బాస్ సిటీపై జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్ముజ్‌ను బ్లాక్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ జలసంధిపై పట్టు కోసం యుద్ధం సాగుతున్న వేళ ఇది కీలక పరిణామంగా మారింది.
News March 26, 2026
వీర సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్!

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. సేన, నేవీ సేన, వాయు సేన పతకాలు పొందిన జవాన్లకు ఇండియన్ రైల్వేలో లైఫ్‌లాంగ్ ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మరొకరితో కలిసి ఫస్ట్ క్లాస్, 2 ఏసీ లేదా ఏసీ ఛైర్ కార్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం అవార్డు గ్రహీతలకు, వారి జీవిత భాగస్వాములకు లేదా అవివాహిత అమరవీరుల తల్లిదండ్రులకు వర్తిస్తుంది.


