News June 27, 2024

LPL-2024లో ‘పవర్ బ్లాస్ట్ ఓవర్లు’

image

లంక ప్రీమియర్ లీగ్(LPL-2024)లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 1-6 ఓవర్లలో ఉండే పవర్ ప్లేకు అదనంగా 16, 17 ఓవర్లలో ‘పవర్ బ్లాస్ట్ ఓవర్లు’ ఉంటాయని పేర్కొంది. ఈ ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉండేందుకు అనుమతి ఉంటుంది. శ్రీలంక బోర్డు ఈ టీ20 లీగ్‌ను 2020లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది LPL జులై 1 నుంచి ప్రారంభం కానుంది.

Similar News

News April 18, 2026

సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

image

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.

News April 18, 2026

భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

image

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

News April 18, 2026

2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

image

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.