News March 22, 2025

రాష్ట్రంలో పవర్ కట్స్.. KTR ఫైర్

image

తెలంగాణలో నెలకొన్న పవర్ కట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పదోతరగతి పరీక్షల సమయంలో పవర్ కట్ వల్ల ఓ విద్యార్థి ఎదుర్కొన్న సమస్యను కేటీఆర్ దృష్టికి ఓ తండ్రి తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలు పవర్ కట్ ఉండటంతో మొబైల్ టార్చ్ ద్వారా, కారులో లైట్ వేసుకొని చదువుకున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్- కరెంట్ ఓ చోట ఉండలేవని కేటీఆర్ విమర్శించారు.

Similar News

News March 23, 2025

BREAKING: కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో వాన పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 23, 2025

ఆ 2 రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

News March 23, 2025

KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.

error: Content is protected !!