News July 4, 2024
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు: కేసీఆర్

TG: రాబోయేది BRS ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం శాశ్వతం కాదు. ప్రజా తీర్పే మనకు శిరోధార్యం. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 26, 2026
డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్

డోర్నకల్-గద్వాల మధ్య 296 km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ మీదుగా సాగుతుంది. DPR తర్వాత దీనికి క్లియరెన్స్ లభిస్తుంది. అయితే జడ్చర్ల-నంద్యాల లైన్లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో భూసేకరణ జాప్యం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నా ఇప్పటివరకు 67% ల్యాండ్ సేకరించారు.
News March 26, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 26, 2026
MI, RCB మ్యాచ్ టికెట్ ధర ₹లక్ష!

దేశంలో IPL క్రేజ్ మామూలుగా లేదు. మ్యాచుల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇదే అదనుగా తమ వద్ద ఉన్న టికెట్లను థర్డ్ పార్టీ సైట్లు భారీ మొత్తానికి విక్రయిస్తున్నాయి. ‘ఈ నెల 29న జరిగే MI-KKR మ్యాచ్ టికెట్ ధరలు ₹6,500-50 వేలు ఉన్నాయి. APR 12న జరిగే MI-RCB టికెట్ రేట్లు ₹15,000-లక్ష పలుకుతున్నాయి’ అని Mid Day తెలిపింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 28న SRH, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.


