News July 2, 2024

ఏపీలో ‘పవర్ స్టార్’ విస్కీ.. వైసీపీ, కూటమి మధ్య వార్

image

AP: కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.

Similar News

News November 26, 2025

అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

News November 26, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.