News March 27, 2025
PPM: అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గిరిజన సబ్ ప్లాన్ (టీ.ఎస్.పీ) ప్రాంత అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖాధికారి డా.టి.కనక దుర్గ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం, సీతంపేటలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ సబ్‌ప్లాన్ ఏరియాలలో 9 అంగన్వాడీ వర్కర్లు, 15 అంగన్వాడీ హెల్పర్లు,12 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినట్టు చెప్పారు.
Similar News
News November 26, 2025
WGL: ఫంక్షన్‌కు తీసుకెళ్లలేదని.. వివాహిత ఆత్మహత్య

WGL జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్‌కు తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో గుగులోతు కవిత(28) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సుకుమార్ పిల్లలతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లడంతో ఆమె ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తలుపు తీయకపోవడంతో ఇంట్లో ఉరేసుకున్నట్లు గమనించారు. ఆమె మృతితో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.