News March 18, 2025
PPM: అంగన్వాడీ హెల్పర్స్‌కు ఇంటర్వ్యూలు చేసిన పీఓ

పీఎం జన్మన్ అంగన్వాడీ హెల్పర్స్ ఇంటర్వ్యూలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తన ఛాంబరులో నిర్వహించారు. మొత్తం ఎనిమిది పోస్టులకు 13 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రాజెక్ట్ అధికారితో పాటు ఐసీడీఎస్ పథక సంచాలకులు డా. టి.కనకదుర్గ, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, సీడీపీఓ తదితరులు ఉన్నారు.
Similar News
News March 19, 2025
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.
News March 19, 2025
బడ్జెట్లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 19, 2025
ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.