News March 12, 2025
PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News March 14, 2025
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2025
BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.