News February 20, 2025

PPM: ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం కావాలి

image

ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ సర్వే 56 శాతం అయినందున అసంతృప్తి వ్యక్తం చేశారు. 12,376 యూనిట్లు సర్వేను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇదే పనిపై ఉండాలని ఆయన అన్నారు.

Similar News

News October 14, 2025

1,743 పోస్టులు.. ఎగ్జామ్ డేట్ ఇదే

image

TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. ఉ.10 నుంచి మ. ఒంటిగంట వరకు మల్టిపుల్ ఛాయిస్, మ.2.30 నుంచి సా.5.30 గంటల వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1,743 పోస్టులకు 3,132 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 14, 2025

అత్యధిక మంది చూసిన సినిమాగా ‘వార్-2’

image

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్-2 థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

News October 14, 2025

చిత్తూరు జిల్లాలో TDPని చుట్టుముడుతున్న వివాదాలు

image

చారిత్రాత్మక విజయం అనంతరం జిల్లాలో TDP బలోపేతం అవుతుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంబేడ్కర్ విగ్రహ దహనం, నకిలీ లిక్కర్ స్కామ్, మహిళలపై లైంగిక వేధింపులతోపాటూ వారి వ్యక్తిగత వీడియోలు తీసిపెట్టాలనే ఆరోపణలు జిల్లాలోని కూటమి MLAల మెడకు చుట్టుకుంటున్నాయి. శుభమా అని అన్ని సీట్లు గెలిచిన TDPలో ఏడాదిన్నరలోపే వివాదాలు రేగడం అధిష్ఠానం వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.