News February 20, 2025
PPM: ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం కావాలి

ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ సర్వే 56 శాతం అయినందున అసంతృప్తి వ్యక్తం చేశారు. 12,376 యూనిట్లు సర్వేను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇదే పనిపై ఉండాలని ఆయన అన్నారు.
Similar News
News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
News March 23, 2025
కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పట్టణంలోని అల్లూరి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించారు. ఆ సందర్భంలో కృష్ణ భారతి మోదీ తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పసల కృష్ణ భారతి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన కృష్ణభారతి ఆదివారం మృతి చెందడంతో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News March 23, 2025
ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.