News February 24, 2025
PPM: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు కీలకపాత్ర అని DRO కె.హేమలత స్పష్టం చేశారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్‌లో అందించాలని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Similar News
News February 24, 2025
కళ్యాణపులోవ పోతురాజుబాబు ఉత్సవాలకు వెళ్తున్నారా?

చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ ఉత్సవాలకు రద్దీ ఎక్కువైతే బైక్‌లు కూడా అనుమతించమని అనకాపల్లి డి.ఎస్.పి శ్రావణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దొండపూడి నుంచి పోతురాజుబాబు ఆలయం వరకు ఉన్న రోడ్డు వెడల్పు తక్కువగా ఉందన్నారు. దీని కారణంగా ఆ రోడ్డులో ఆటోలు, కార్లు, వ్యాన్‌లు అనుమతించమన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేయాలని భక్తులకు సూచించారు.
News February 24, 2025
ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు గడువు పెంపు

ఏయూ దూరవిద్యా కేంద్రంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు దరఖాస్తు చేయడానికి మార్చి 13 వరకు గడువున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17 వరకు, మార్చ్ 20 వరకు రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 20 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభంఅవుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఏయూ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
News February 24, 2025
పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష

హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పోలీస్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోమ్ విపత్తుల శాఖకు కావలసిన నిధులపై చర్చించినట్లు ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. వసతుల కల్పన, సంక్షేమం, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలిపారు.