News February 5, 2025
PPM: ‘గర్భిణీల సురక్షిత ప్రసవం శిశు సంక్షేమ శాఖ బాధ్యత’

గర్భిణీ ఆరోగ్యం, సురక్షిత ప్రసవం మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యత అని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి మహిళ గర్భిణీగా ఉన్నప్పటి నుంచే వారి ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. రక్తహీనత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News March 17, 2026
TGRJC-CET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో 35 గురుకుల జూ.కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశానికి ‘TGRJC-CET-2026’ నోటిఫికేషన్ విడుదలయింది. MPC, BPC, MEC, CEC గ్రూప్స్‌లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టు మే3న నిర్వహిస్తారు. APR15 వరకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
News March 17, 2026
బాపట్ల: 40.20 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

జిల్లాలో ఫిబ్రవరి నెలలో 40.20 లక్షల విలువైన 201 ఫోన్లు రికవరీ చేసినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేరుగా ఆయన ఫోన్లను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 806 మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేశామన్నారు. ప్రజలు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 17, 2026
కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.


