News March 13, 2025
PPM: ‘గృహ నిర్మాణాలకు రూ.73.9 కోట్ల అదనపు సాయం’

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ బుధవారం తెలిపారు. స్వర్ణ ఆంధ్ర@2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పీఎంఏవై 1.0 లో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.73.09 కోట్ల అదనంగా ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ వివరించారు.
Similar News
News October 21, 2025
అమరవీరుల స్తూపానికి సైబరాబాద్ సీపీ నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కొండాపూర్లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అమరవీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జోన్ డీసీపీలు, అధికారులు పాల్గొన్నారు.
News October 21, 2025
GNT: తవ్వకాల్లో బంగారం దొరికిందని.. రూ.12లక్షలు స్వాహా

తవ్వకాల్లో బంగారం దొరికిందని చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయించిన కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరండల్ పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ డీఎస్పీ అరవింద్ వివరాల ప్రకారం.. ఐదుగురు సభ్యుల ముఠా నగరానికి చెందిన దంపతులను నమ్మించి రాగి-జింక్ మిశ్రమంతో కూడిన అరకేజీ నకిలీ బంగారం ముక్కలు ఇచ్చింది. వారి నుంచి రూ.12 లక్షలు తీసుకుని ఉడాయించారు. కేసు దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకున్నారు.
News October 21, 2025
18 మండలాలలో 59 గ్రామాల ఎంపిక: కలెక్టర్

ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. జిల్లాలోని 18 మండలాలలో 59 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఒక్కొక్క గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయించిందన్నారు. ఎంపిక చేసిన గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అభివృద్ధి పనులపై ఎండీఓల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.