News September 27, 2024

PPM: గ్రామాలకు రోడ్డు సౌకర్యానికి మొదటి ప్రాధాన్యత

image

గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ఇంజినీరింగు పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు.

Similar News

News November 1, 2025

సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

image

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్‌లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.

News November 1, 2025

విజయనగరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

image

విజయనగరం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, పండు పడాల్ వంటి నాయకుల త్యాగాలను స్మరించారు. విద్యార్థులతో మెగా ర్యాలీ, మొక్కలు నాటడం, ఆటల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 15న జరిగే మెగా ఈవెంట్‌కు సిద్ధంగా ఉన్నామని గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు.

News November 1, 2025

కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక డ్రైవ్: కలెక్టర్

image

నవంబర్ 17 నుంచి 30 వరకు జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, కుష్టు వ్యాధి సోకిన వారిని సమాజం చిన్న చూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుండి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు.