News February 16, 2025
PPM: చెత్త నుంచి సంపద సృష్టిపై సమావేశం

పార్వతీపురం జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపద సృష్టిపై దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి వర్మి కంపోస్టులతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత చేపట్టాలన్నారు. శనివారం స్వచ్ఛ దివాస్, ఎంఎస్ఎంఈల సర్వేపై కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News September 18, 2025
ఏటిగట్టు వద్ద సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ వేడుకలు!

బతుకమ్మ వేడుకలకు MHBD జిల్లా సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, రామ మందిరం, వేంకటేశ్వరస్వామి గుడి, హనుమంతుని గడ్డ, బంధం చెరువు, NTR స్టేడియం, మరిపెడ-MPDO కార్యాలయం, డోర్నకల్లో ఊర చెరువు, కురవిలో పెద్ద చెరువు, కేసముద్రంలో దర్గా చెరువు, గార్లలో పాకాల ఏరు, దంతాలపల్లి రామలింగేశ్వర టెంపుల్, ఇనుగుర్తి బంగారు కత్వగుంటి, బేడీచెరువు, గూడూరులోని ఏటిగట్టు వద్ద సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుతారు.
News September 18, 2025
GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
News September 18, 2025
రాజమండ్రి: నూతన కలెక్టర్ను కలిసిన జిల్లా ఎస్పీ

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.