News April 11, 2025
PPM: జిల్లాకు 12 జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్లు

జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా 12 జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్లు వచ్చాయి. దీనికి కృషి చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం అభినందించారు. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ సిస్టం రిసోర్స్ సెంటర్లకు చెందిన కేంద్ర ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
Similar News
News December 6, 2025
NLG జిల్లాలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిసి., ఇబిసి, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు Awareness programme, IELTS కొరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. website:tgbcstudycircle.cgg.gov.in నందు అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
News December 6, 2025
తొర్రూరు: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి

స్థానిక ఎన్నికల తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్లైన్ కంటెంట్ రూల్స్ను మస్క్ ప్లాట్ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.


