News March 11, 2025
PPM: జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన

జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. హేమలత అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని, బస వేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు అవుతారని ఆమె తెలిపారు.
Similar News
News March 17, 2026
తిరుపతి: రూ.50 లక్షలు స్వాహా.. ముగ్గురు అధికారులపై వేటు

కోట మండల పరిషత్ ఆఫీసులో ఎంపీడీవోగా పనిచేసిన బ్రహ్మయ్య, సూపరింటెండెంట్ కౌసల్య, జూనియర్ అసిస్టెంట్ షేక్ అబూబకర్ సిద్దిఖ్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు 2015-19లో కోట ఎంపీడీవో ఆఫీసులో విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ పింఛన్ నగదు రూ.27.87 లక్షలు దుర్వినియోగం, మండల పరిషత్ సాధారణ నిధులు రూ. 26.15 లక్షలు గల్లంతుపై ఆ ముగ్గురిని తొలగించారు.
News March 17, 2026
విజయవాడలో 18న వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

విజయవాడలో ఈ నెల 18వ తేదీన YCP ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. లబ్బీపేట ఓ కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో YCP అధినేత YS జగన్ పాల్గొంటారన్నారు. MLC తలశిల రఘురామ్, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ MLA మల్లాది, మాజీ మంత్రి వెల్లంపల్లి, YCP మైనార్టీ నేతలు ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు.
News March 17, 2026
శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా మంగళవారం..
◆ ఉ.8గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు
◆ ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ
◆ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం
◆ రా.7 గంటలకు స్వామి, అమ్మవారికి కైలాస వాహన సేవ పూజలు
◆ అమ్మవారికి మహాదుర్గ అలంకారం
◆ రా.7.30 నుంచి పురవీధుల్లో గ్రామోత్సవం
◆ రాత్రి 8 గంటలకు కళ్యాణం, ఏకాంత సేవ


