News February 7, 2025
PPM: జిల్లా వ్యాప్తంగా రిజర్వుడ్ షాపులకు 12 దరఖాస్తులు

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 12 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. సాలూరు- 2, పార్వతీపురం- 2, వీరఘట్టం -5, పాలకొండ -3 దరఖాస్తులు అందినట్లు ఆయన వివరించారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 10న లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.
Similar News
News March 8, 2026
చిత్తూరులో భానుడి ప్రతాపం

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
News March 8, 2026
తూ.గో: కారులో ఫొటోలు.. SMలో వైరల్

ఓ యువతివి అసభ్యకర దృశ్యాలను చిత్రీకరించి SMలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణనగర్‌లో ఉండే దర్శకుడు శంకర్(25) కాకినాడ నుంచి వచ్చిన యువతి(23)కి వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పించాడు. కారులో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 8, 2026
నిర్మల్: ఆ కుటుంబంలో ‘ఆమె’ కీలకం

నిర్మల్ జిల్లా పెద్ద బెల్లాల్‌కి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు TGPSC ద్వారా ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. జాడి విజయలక్ష్మి ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈగా, ఆమె వదిన చంద్రకళ వీఆర్వోగా, మరో వదిన జ్యోతి గ్రూప్-2 ద్వారా ఎంపీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం జ్యోతి సోన్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.
HAPPY WOMENS DAY


